మా బతుకులు ఎట్లా?.. Daily Drag
@sunithadharmendar
VPoints 1446
Supporters 13
Vent 459

లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఈ నెల మొదటి నుంచే షాపులు తెరిచారు. చిన్న వ్యాపారులు, మెకానిక్ లు, స్వయం ఉపాధి పనులు చేసుకునే వారికి కాస్త ఆదాయం వస్తోంది. ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ పెడితే ఏం చేయాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడిప్పుడే వ్యాపారం కొద్దిగా పుంజుకుంటుందని, అంతలోనే లాక్ డౌన్ పెడితే షాపుల కిరాయిలు ఎలా కట్టాలని, పనిచేసే వాళ్లకు జీతాలు ఎట్లాఇవ్వాలని, ఇంటి ఖర్చులు ఎలా వెళ్లదీయాలని వ్యాపారులు వాపోతున్నారు. కరోనా కట్టడికి సర్కారు వేరే ప్రత్యామ్నాయాలు వెదికితే మంచిదని, మళ్లీలాక్ డౌన్ పెడితే లక్షల కుటుంబాలకు పని లేకుండా పోతుందని విద్యానగర్ కు చెందిన ట్రావెల్స్ యజమాని వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు.

లిక్కర్ షాపుల దగ్గర క్యూలు..
ఇంతకుముందు ఒక్కసారిగా లాక్ డౌన్ విధించడంతో లిక్కర్ అలవాటు ఉన్నవాళ్లు అల్లాడారు. కొందరు బ్లాక్‌లో ఐదారు రెట్లు ఎక్కువ ధరకు కొన్నారు. ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ పెడ్తారనే ప్రచారంతో ఆదివారం సాయంత్రం నుంచే వైన్ షాపుల వద్ద క్యూలు మొదలయ్యాయి. చాలా మంది బాటిళ్లకు బాటిళ్లు కొనుగోలు చేశారు. చాలా వైన్‌ షాపుల్లో ఫుల్‌ బాటిళ్ల స్టాక్‌ లేకుండా పోయింది. చేతిలో డబ్బుల్లేని వాళ్లు.. అప్పు చేసి మరీ లిక్కర్ కొనడం కనిపించింది. సాధారణంగా గ్రేటర్‌ హైదరాబాద్లో రోజుకు సగటున 30 కోట్ల దాకా లిక్కర్ స్టాక్ తరలిస్తుంటారు. సోమవారం సాయంత్రం కాకుండానే 35 కోట్ల వరకు స్టాక్‌ డిపోల నుంచి తరలించారు.

ఇప్పటికే బాధలుపడ్డ..
మాది కర్నాటకలోని హుమ్నాబాద్. హైదరాబాద్ సిటీలో నాలుగేండ్లుగా హమాలీ పనిచేసుకుంటున్న. మొన్న లాక్ డౌన్ టైంలనే ఇక్కడ ఇరుక్కపోయి చాలా ఇబ్బంది పడ్డ . లాక్ డౌన్ ఓపెన్ చేసినంక పని దొరికింది. మళ్లీ లాక్ డౌన్ చేస్తున్నరన్న వార్తలు చూసి ఫ్యామిలీతో ఊరికి
వెళ్లిపోతున్నం.

-30 Characters

What's your mood

Auto detect mood
Mood Board
Language