ఇలా అయితే కష్టమే..... Daily Drag
@sunithadharmendar
VPoints 1493
Supporters 15
Vent 474

అడ్డగోలుగా రేట్లు పెంచేశారు
మళ్లీ లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సర్కారు నుంచి ప్రకటన రావడంతో వ్యాపారులు నిత్యావసరాల రేట్లు ఒక్కసారిగా పెంచేశారు. 15 రోజులే లాక్ డౌన్ ఉంటుందన్న సంకేతాలు ఇస్తున్నా ఎందుకైనా మంచిదని చాలా మంది ఒకట్రెండు నెలలకు సరిపడా బియ్యం, నూనెలు, పప్పులు, ఇతర సరుకులు తీసుకెళ్తున్నారు. సోమవారం ఉదయం నుంచే హైదరాబాద్ లోని అన్నిసూపర్ మార్కెట్లు, హోల్ సేల్ షాపుల వద్ద జనాలు క్యూ కట్టారు. దుకాణాల్లో రేట్లు 5 నుంచి 20 శాతం వరకు పెంచి అమ్ముతున్నారు. అన్‌‌లాక్ తర్వాత కందిపప్పు కిలో రూ.90 నుంచి 95 మధ్యఉంటే.. నిన్నటినుంచి రూ.110పైగా బిల్లు వేస్తున్నారు. మినపపప్పు రూ.115 నుంచి రూ.130 కి, పెసర పప్పు రూ.120–130 నుంచి రూ.150 పైకి పెంచేశారు. నూనెల ధరలనూ పది ఇరవై రూపాయలు పెంచారు.

ఉద్యోగాలు వదిలి ఊర్ల బాట
లాక్‌ డౌన్‌ తొలిదశలో బాగా ఇబ్బందిపడ్డ చిరుద్యోగులు.. మళ్లీ ఆ పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు. ఉద్యోగాల్లేక, ఉన్నా జీతాలు సరిగా రాక, వచ్చిన డబ్బులు అవసరాలకు సరిపోక అవస్థలు పడ్డారు. ఇప్పుడిక చేసింది చాలనుకుంటూ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి ఊర్ల బాట పడుతున్నారు. అంతా బాగుంటే మళ్లీ తిరిగొద్దాం, లేకుంటే అక్కడే ఏదో రకంగా బతికేద్దామనే మొండితనంలో బస్సులు ఎక్కేస్తున్నారు. అన్‌ లాక్‌ మొదలయ్యాక వివిధ రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన సుమారు లక్షన్నర మంది వలస కార్మికులు మళ్లీ టెన్షన్‌ కు గురవుతున్నారు. కన్ స్ట్రక్షన్ తో పాటు వివిధ ఇండస్ట్రీల్లో పనిచేసే వీళ్లు ఇప్పుడెన్ని రోజులు లాక్‌డౌన్‌ ఉంటుందోనని టెన్షన్‌ పడుతున్నారు. ఇంతకుముందే తిండి, నీళ్లు లేక, డబ్బు దొరక్క అవస్థలు పడి.. వందలు, వేల కిలోమీటర్లు నడిచి సొంతూర్లకు వెళ్లారు. అన్‌ లాక్‌ మొదలయ్యాక తిరిగొస్తే.. ఇప్పుడు మళ్లీ లాక్డౌన్ టెన్షన్‌ మొదలైంది. మరోవైపు ఇప్పటికే కన్ స్ట్రక్షన్ రంగం సంక్షోభంలో ఉందని.. మళ్లీ లాక్ డౌన్ పెడితే నడిచే ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

-30 Characters

What's your mood

Auto detect mood

Talk Freely

Mood Board
Language