రద్దీ పెరిగింది..... Daily Drag
@sunithadharmendar
VPoints 1446
Supporters 13
Vent 459

హైదరాబాద్ లో లాక్ డౌన్ పెడితే కనీసం తిండి కూడా దొరకదని, ఇక్కడ ఉండటం కంటే ఊరికి వెళ్లిపోవడమే మంచిదని చిన్న ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అందుకే సొంత ఊర్లకు వెళ్లిపోతున్నామని అంటున్నా రు. హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లు ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు సిటీ శివార్లలోని బస్టాండ్లలో సోమవారం తెల్లారి నుంచే రద్దీ ఎక్కువగా కనిపించింది. సిటీ నుంచి జిల్లాలకు వెళ్లేబస్సులు తిరిగే మెహిదీపట్నం, ఉప్పల్, ఎల్బీనగర్, బాలానగర్, సికింద్రాబాద్, ఆరాంఘర్, లింగంపల్లి, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో బస్టాండ్లన్నీ జనం రద్దీతో కనిపించాయి. నిన్నమొన్నటి వరకు ఖాళీగా తిరిగిన జిల్లా బస్సులు సోమవారం ఫుల్లుగా కనిపించాయి. ఇక కొందరు సొంత వెహికల్స్ పై, ఇంకొంత మంది ప్రైవేటు కార్లు మాట్లాడుకుని వెళ్తున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్లలోనూ రద్దీ పెరిగింది

-30 Characters

What's your mood

Auto detect mood
Mood Board
Language