లాక్డౌన్ వార్తలు వినగానే హైదరాబాద్ లో ఆందోళన Daily Drag
@sunithadharmendar
VPoints 1446
Supporters 13
Vent 459

మళ్లీ లాక్‌ డౌన్‌ పెట్టడంపై సీఎం ఆలోచన చేస్తున్నారనే వార్తలతో హైదరాబాద్‌ జనంలో హైరానా మొదలైంది. మళ్లీ అన్నీ బంద్ అయితే ఇబ్బందిపడాల్సి వస్తుందన్న ఆందోళన పెరిగింది. దీంతో చిన్న ఉద్యోగులు, కూలీలు, చిన్న చిన్న దుకాణాలు నడుపుకొనేవాళ్లు ఊర్లకు వెళ్లిపోతున్నారు. కరోనా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాకే తిరిగి హైదరాబాద్ వస్తామని అంటున్నారు. సోమవారం తెల్లారి నుంచే హైదరాబాద్లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు బిజీగా కనిపించాయి. సొంత, ప్రైవేటు వాహనాల్లోనూ జనం ఊరిబాట పట్టారు. ఇక ఇక్కడే ఉండేవాళ్లు లాక్డౌన్ ఏర్పాట్లలో పడ్డారు. నిత్యావసరాలు, ఇతర వస్తువులు కొనుక్కునేందుకు సూపర్ మార్కెట్లు, ఇతర షాపుల ముందు క్యూ కట్టారు. ఒకట్రెండు రోజుల కిందటిదాకా ఖాళీగా కనిపించిన వైన్ షాపుల ముందు కూడా క్యూలు కనిపించాయి. మళ్లీ లాక్ డౌన్ పెడితే తమ బతుకు ఏమవుతుందోనని చిన్నచిన్న దుకాణాలు, మెకానిక్ లు, ఇతర స్వయం ఉపాధి పనులు చేసుకునేవాళ్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

-30 Characters

What's your mood

Auto detect mood
Mood Board
Language